మానవత్వాన్ని చాటుకున్న కోడూరు వైద్యురాలు

మానవత్వాన్ని చాటుకున్న కోడూరు వైద్యురాలు

NLR: తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరు గ్రామంలో మంగళవారం అనిల్ అనే వ్యక్తి స్కూటీపై వెళుతూ కరెంటు పోల్‌ను ఢీకొని కింద పడిపోయాడు. అటుగా వెళుతున్న కోడూరు పిహెచ్సి వైద్యురాలు హేన, అపస్మారక స్థితిలో ఉన్న అనిల్‌ను గమనించి, సీపీఆర్ చేసి, తన కారులో ఇందుకూరుపేట పిహెచ్సికి తరలించారు. వైద్యురాలి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.