VIDEO: నాలుగేళ్లుగా హాస్టల్ నిర్మాణం పూర్తి కాక విద్యార్థుల ఇబ్బందులు

MHBD: మెడికల్ కళాశాల హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంతో 62 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా భవనం నిర్మాణం పూర్తికాకపోవడం, వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంతో పాటు, కలెక్టర్ ద్వారా పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో నిరసన తెలిపారు.