'తీరు మార్చుకోకుంటే'.. ఎమ్మెల్యేకు CM క్లాస్
AP: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం TDP MLA మామిడి గోవిందరావుకు CM చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఆయన తీరుపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, పార్టీకి బలమైన నియోజకవర్గంలో ఇలాంటి ప్రవర్తన సరికాదని చెప్పారు. అక్కడ YCP కూడా బలంగా లేదని, తన ప్రవర్తనతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. తీరు మార్చుకోకుంటే సహించేది లేదని స్పష్టంచేశారు.