రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు చరణ్ ఎంపిక
JN: పాలకుర్తి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎల్లబోయిన చరణ్ స్టేషన్ ఘనపూర్లో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చరణ్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.