హీరా గ్రూప్‌పై మరో మోసం కేసు నమోదు

హీరా గ్రూప్‌పై మరో మోసం కేసు నమోదు

హీరా గ్రూప్‌పై రూ.27 లక్షలు మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ నౌహీరా షేక్‌తో పాటు మరో ఆరుగురిపై మాధన్నపేట PSలో కేసు నమోదైంది. నౌహీరా గతంలో చేసిన ఆర్థిక మోసాల కేసులతో పాటు, తాజాగా ఆమె గ్రూప్‌పై ఈ కేసు నమోదు కావడంతో విచారణ మరింత ముమ్మరం కానుంది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.