పొన్నూరులో యువకుడు అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆదివారం రైల్వే స్టేషన్ రోడ్డులో నిడుబ్రోలు వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో కొందరు వ్యక్తులు యువకుడిపై దాడి చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.