VIDEO: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

NRML: తానుర్ మండలంలోని బెల్ తరోడా వద్ద బుధవారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మహాలింగి గ్రామానికి చెందిన ప్రభుదాస్ భైంసా వెళ్లి మహాలింగి వెళ్తూ బెల్ తరోడాలో ఆగాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో డీసీఎం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.