పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈనెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో 10 రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. అలాగే, APలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.