జేసీగా బాధ్యతలు స్వీకరించిన వైఖోమ్ నిడియా దేవి
కోనసీమ జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వైఖోమ్ నిడియా దేవి గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.