కౌన్సిలర్ తల్లి మృతి.. ఎమ్మెల్యే నివాళులు

కౌన్సిలర్ తల్లి మృతి.. ఎమ్మెల్యే నివాళులు

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని 29వ వార్డు కౌన్సిలర్ ప్రతాపరెడ్డి మాతృమూర్తి నీలమ్మ శనివారం వయోభారంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.