వాలీబాల్ పోటీలు ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రోటరీ పూర్వ అద్యక్షులు దాకరపు కృష్ణ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 36 వాలీబాల్ టీమ్‌లు పాల్గొంటున్నాయని కమిషనర్ అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించాలన్నారు.