RMP హత్య కేసులో వీడిన మిస్టరీ

RMP హత్య కేసులో వీడిన మిస్టరీ

BPT: అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్ఎంపీ డా. కోటిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య ఆదిలక్ష్మి పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, అనంతరం రోకలిబండతో బాది భర్తను హతమార్చినట్లు డిఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. ఈ దారుణానికి కూతురు ప్రగతి, మరో వ్యక్తి ప్రసంగి సహకరించారని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.