అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

GDWL: తుంగభద్రా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అయిజ ఎస్సై కేటీ మల్లేష్ పట్టుకున్నారు. తాండ్రపాడు చౌరస్తాలో తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.