సైబర్ సేఫ్ కరీంనగర్.. రంగంలోకి 'ఆపరేషన్

సైబర్ సేఫ్ కరీంనగర్.. రంగంలోకి 'ఆపరేషన్

KNR: సైబర్ నేరాలకు అడ్డాగా మారుతున్న 'మ్యూల్' ఖాతాలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 'ఆపరేషన్ క్రాక్డౌన్' ద్వారా ఇప్పటికే 34 నకిలీ ఖాతాలను గుర్తించి, 26 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఖాతాల ప్రారంభంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, నిందితులకు సహకరించే బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.