దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
HYD: నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో సదరు వ్యక్తి బాలికను తీసుకెళ్లిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.