VIDEO: పుచ్చకాయల లోడుతో ఆటో బోల్తా

VIDEO: పుచ్చకాయల లోడుతో ఆటో బోల్తా

ప్రకాశం: పొదిలి మండలం సలక నూతల గ్రామ సమీపంలోని ఒంగోలు- కర్నూలు జాతీయ రహదారిపై పుచ్చకాయల లోడుతో వెళ్తున్న మినీ ఆటో బుధవారం రాత్రి బోల్తా పడింది.దీంతో పుచ్చకాయలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొనకనమిట్ల మండలం నాగిరెడ్డిపల్లి నుంచి పుచ్చకాయల లోడుతో గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.