తిరుపతి ఇస్కాన్‌లో కృష్ణాష్టమి వేడుకలు

TPT: కృష్ణాష్టమి సందర్భంగా తిరుపతి ఇస్కాన్‌లోని రాధా కృష్ణ సమేత అష్టసతులను ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రతినిధులు MLAకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మున్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు.