నేడు మార్కెట్లో పత్తి ధర ఎంతంటే..?

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం ఇవాళ ప్రారంభం కాగా పత్తి మోస్తారుగా తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పత్తికి రూ.7550 ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాది. అయితే గత వారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా తగ్గింది.