వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

WNP: గోపాల్ పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన గన్నోజి బిక్షపతి (46) ఈ నెల 3న రాత్రి భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయి అదృశ్యమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అందరూ నిద్రపోయాక బయటికి వెళ్లిన బిక్షపతి ఇంతవరకు తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.