అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి: ఎస్పీ

MBNR: అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భూత్పూర్ మండలం పోతులమడుగు-గోపన్నపల్లి గ్రామాల మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని వెల్లడించారు.