రేవంత్ ముక్కుసూటిగా మాట్లాడతారు: శ్రీధర్‌బాబు

TG: సీఎం రేవంత్ ముక్కుసూటిగా మాట్లాడతారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 'ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిన పెడతామనే అన్నారు. హెలికాప్టర్‌ను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. పెద్ద కాన్వాయ్ కంటే హెలికాప్టర్ చాలా చవక. గత ప్రభుత్వం అద్దె చెల్లించి కూడా చాపర్ వాడలేదు. ఇప్పుడు మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి. పహల్గామ్ విషయంలో కేంద్రం విఫలమైంది' అని పేర్కొన్నారు.