పేదలకు సీఎం సహాయనిధి భరోసా: మాజీ ఎమ్మెల్యే
KKD: ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSR వర్మ స్పష్టం చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు బాధితులకు CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. వైద్యానికి దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, బాధితులకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు.