మడకశిరలో హెలికాప్టర్ ల్యాండింగ్ స్థల పరిశీలన
సత్యసాయి: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు మడకశిర మండలం కల్లుమర్రి హైస్కూల్‌లో టీడీపీ నేతలు, అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో పెనుగొండ డీఎస్పీ నర్సింగరావు, మండల కన్వీనర్ కల్లుమర్రి నాగరాజు, ఆర్అండ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ, మడకశిర సీఐ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.