కొత్తగా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని వినతి
RR: చౌదరిగూడ మండలానికి కొత్తగా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మండలంలో 40 వేల జనాభా ఉందని, ప్రజలకు గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం, కలెక్టర్లు గ్యాస్ కొరత లేదని చెబుతున్న గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.