సృష్టి సెంటర్ కేసులో కీలక మలుపు!

సృష్టి సెంటర్ కేసులో కీలక మలుపు!

TG: హైదరాబాద్‌లోని సృష్టి సెంటర్ అక్రమ దత్తత కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రస్తుతం శిశు విహార్‌లో ఉన్న చిన్నారిని రాజస్థాన్ దంపతులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని శిశు సంక్షేమ శాఖను, అలాగే సిట్‌తో పాటు గోపాలపురం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది.