VIDEO: రొంపిచర్లలో తేలికపాటి వర్షం

CTR: రొంపిచెర్ల, బొమ్మయ్యగారిపల్లి గ్రామపంచాయతీలలో శుక్రవారం తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం పడింది. దీంతో వారికి కాస్త ఉపశమనం లభించింది. అయితే, ఎక్కడ పంటలు దెబ్బతింటాయో అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.