జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
MBNR: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాచుకోవడం దోచుకోవడమే సరిపోయిందని అభివృద్ధి ఏమాత్రం జరగలేదని వెల్లడించారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు.