ధర్నాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి: బీజేపీ చీఫ్
TG: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాద్ధాంతం చేయొద్దని BJP చీఫ్ రామచందర్ రావు అన్నారు. గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం పేరు పెడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కంటే నరేగాను విజయవంతం చేసింది BJPనే అని పేర్కొన్నారు. తమ ఆఫీస్‌ల ఎదుట ధర్నాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గాంధీపై కాంగ్రెస్ నేతలకు గౌరవం ఉంటే సోనియా, రాహుల్ పేరు పక్కన గాంధీ తీసేయాలని డిమాండ్ చేశారు.