'గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేసింది'
MHBD: గ్రామాల అభివృద్ధి కోసం గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం, రామాంజపూర్ గ్రామాల్లో ఈరోజు ఉదయం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.