లాటరీ టికెట్లు, నాటుసారాతో ఐదుగురు అరెస్ట్

సత్యసాయి: కదిరి కూటాగుళ్ల రైల్వే గేట్ సమీపంలో లాటరీ టికెట్లు అమ్ముతూ, నాటుసారా విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని సీఐ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 16 లీటర్ల నాటుసారా, 47 లాటరీ టికెట్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుచేయగా న్యాయమూర్తి రిమాండు విధించారు.