పయ్యావుల కేశవును కలిసిన జేఏసీ నాయకులు
ATP: రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవును ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీ నాయకులు కలిసి సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. డీ.సుధాకర్, వీ.లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. మూడు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.