గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టీటీడీ ఛైర్మన్

TPT: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావులు సారె సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని అన్నారు. భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు.