కాళీమాత దేవాలయాన్ని సందర్శించిన DCP
మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్‌లో నూతనంగా ప్రారంభించిన శ్రీ కాళీమాత అష్ట కాలభైరవ గణపతి దేవాలయాన్ని మంగళవారం DCP భాస్కర్ సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రఘు స్వామి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, DCPకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణం కోసం కృషి చేస్తున్న ఆలయ నిర్వాహకులని డీసీపీ సన్మానించి, అభినందించారు.