అక్రమంగా ఆవుల తరలింపు.. కేసు నమోదు
ఏలూరు రూరల్ పోలీసులు గురువారం ఆశ్రమం ఆసుపత్రి వద్ద అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ తనిఖీలో 10 ఆవులు, 4 దూడలను రక్షించి కొప్పాకలోని గో సంరక్షణ సమితికి అప్పగించారు. జగ్గంపేట నుంచి హనుమాన్ జంక్షన్ సంతకు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వ్యాన్ డ్రైవర్ త్రిమూర్తులపై కేసు నమోదు చేశారు.