ప్రమాదకరంగా కల్వర్టు.. పట్టించుకోని అధికారులు

BDK: బొమ్మనపల్లి గ్రామ శివారులో కల్వర్టు ప్రమాదకరంగా మారింది. రెండు వైపులా రహదారిపై గుంతలయ్యాయి. శిథిలావస్థకు చేరి అయిదేళ్లు గడుస్తున్నా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఈ మార్గంలోనే నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏఈను వివరణ కోరగా ప్రతిపాదనలు పంపామన్నారు.