'బోయకొండ ఆలయ ఛైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి'

CTR: చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయ ఛైర్మన్ పదవిని వాల్మీకులకే కేటాయించాలని వాల్మీకి మహాసేన డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవస్థాపకులు ముత్తారాశి హరికృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి వినతి పత్రం సమర్పించారు. 2012 నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, నిరవధిక సమ్మెలు చేసినా న్యాయం జరగలేదని, వాల్మీకుల మనోభావాలకు అనుగుణంగా తక్షణమే పదవి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.