CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
NDL: నందికొట్కూరు పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం బాధితులకు పంపిణీ చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసులతో పంపించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 4,26,267 రూపాయలను మాజీ ఎమ్మెల్యే బాధితులకు అందజేశారు. బాధితులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.