గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ELR: గుడ్ ఫ్రైడే ఏసుక్రీస్తు త్యాగానికి, ప్రేమకు, కరుణకు ప్రతీకని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.