నకరికల్లులో బోల్తా పడిన లారీ
PLD: నకరికల్లు అడ్డరోడ్డు ప్రధాన రహదారిపై మంగళవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో లారీ కింద ఓ వ్యక్తి చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు. లారీ అడుగు భాగంలో రెండు కాళ్లు కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.