అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృతి.. రంగంలోకి అధికారులు
NGKL: పెద్దకొత్తపల్లి మండలం తాళ్ళ వెంకటస్వామి కోళ్ల ఫామ్‌లో ఇటీవల 4,500 కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందిన విషయం తెెలిసిందే. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పశువైద్యాధికారి డా. జ్ఞాన శేఖర్, మండల అధికారిణి డాక్టర్ కల్పన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో అక్కడ మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి, రిపోర్ట్ వచ్చాక కారణాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.