వీధి కుక్కలు.. కాలనీవాసుల వినూత్న ఆలోచన
RR: వీధికుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటిదగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఇది చూసి వీధికుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.