జగన్‌ది కపట ప్రేమ: మంత్రి నిమ్మల
AP: కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట ప్రభుత్వ వాదనలపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఐదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ నిద్రపోయారని ప్రశ్నించారు. జలవనరులపై ఇప్పుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు ఏమైందని మండిపడ్డారు.