'చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరాని వారయ్యారు'
RR: షాద్‌నగర్‌లో MRPS ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి MRPS జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి జరిగితే దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని అన్నారు. ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరానివారయ్యారని మండిపడ్డారు.