వాలీబాల్ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
SRD: క్రీడల ద్వారా శారీరిక ఆరోగ్యం, క్రమశిక్షణ పెరుగుతుందని BRS రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.