'విద్యార్థులు పురాణాలు చదవాలి'
SKLM: లావేరు మండల శాఖ గ్రంధాలయంలో ఆదివారం 'ఉదయం చదవడం మాకిష్టం' కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయధికారి మురపాక శ్రీనివాసరావు విద్యార్థులకు రామాయణంలోని సుందరకాండ విభాగం గురించి తెలియజేశారు. ఆ కథలో ఉన్న నీతిని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు పురాణాలు చదవాలని సూచించారు. విద్యార్థులతో యోగ ఆసనాలు వేయించారు. గ్రంథాలయ సహాయకులు వీరభద్రుడు ఉన్నారు.