సవితను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ

సవితను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ

సత్యసాయి: పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో నూతన అదనపు ఎస్పీ(అడ్మినిస్ట్రేషన్) గీతా సూరాన మహావీర్ ఇవాళ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత నూతన బాధ్యతలు స్వీకరించిన గీతా సూరాన మహావీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, పోలీసు విభాగం సమన్వయం, భద్రతా చర్యలపై ఇరువురూ చర్చించుకున్నారు.