ప్రమాదవశాత్తు యువ రైతు మృతి
KMM: వైరా మండలం పుణ్యపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుందని శనివారం స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిర్ర హరీష్ (24) అనే యువకుడు ఓ రైతు పొలంలో ట్రాక్టర్కు అమర్చిన రోటావేటర్‌తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించినట్లు అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.