కొండవీటి వాగు పరిశీలించిన మంత్రి నారాయణ

GNTR: అమరావతి రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద కొండవీటి వాగు పరిస్థితిని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాల్సి ఉండగా, మట్టితో నిండిపోవడం వల్ల నీరు వెనక్కి చేరిందని మంత్రి పేర్కొన్నారు.