ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీ
BDK: బూర్గంపాడు మండలంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో డా. తుకారాం రాథోడ్ పాల్గొని ఆరోగ్య అవగాహనపై సందేశం ఇచ్చారు. విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది భారీగా పాల్గొని అవగాహన నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి పనితీరుపై సమీక్షించారు.