గర్భిణీ అని చూడకుండా.. పోలీస్ దారుణం
బీహార్‌లోని పాట్నాలో ఓ గర్భిణీ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆ మహిళ ప్రయాణిస్తున్న స్కూటీకి రూ.12 వేల చలాన్ ఉందని దాన్ని సీజ్ చేసి తరలిస్తుండగా, ఆ గర్భిణీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పోలీస్ అధికారి, మహిళ కడుపునకు తగిలేలా స్కూటీని నడిపాడు. ఈ వీడియో వైరల్ అవడంతో, ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.